On today's date APRIL 1st, 1935 : RESERVE BANK OF INDIA, Mumbai Established as per the out look of Dr.B.R.Ambedkar
అంబేద్కర్ గారు లండన్ లో చదువుకున్న సమయంలో బరోడా సంస్థానం నుంచి డబ్బు పంపడం కుదరదని ఒక ఉత్తరం అంబేద్కర్ గారికి ముట్టింది.
ఆ సమయంలో అంబేద్కర్ గారికి ఏం చేయాలో అర్థం కాలేదు నెల రోజులు గడిచింది యూనివర్సిటీ వారు చదువు ఆపేసి ఇండియాకు వెళ్లిపోమని చెప్పారు.
ఆ సమయంలో అంబేద్కర్ గారు అమ్మ రమాబాయికి ఉత్తరం రాశాడు.. నాకు బరోడా సంస్థానం డబ్బు పంపడం ఆపేసింది ఇక్కడ రోజుకు ఒక బన్ను తిని కాలం గడుపుతున్నాను.. ఎలాగైనా ఈ కోర్సు చేయాలి కాబట్టి నీ వద్ద ఏమైనా డబ్బులు ఉంటే పంపించు అని ఉత్తరం రాశాడు.
నా వద్ద "పేడ పిడకలు" ఆమ్మగా వచ్చిన డబ్బు 17 రూపాయలు మాత్రమే ఉంది అయితే ఆ డబ్బు మీకు పంపితే బాబు అనారోగ్యంతో ఉన్నాడు బాబుకి డాక్టర్ వద్ద చూపించాలి కాబట్టి నేనేం చేయాలో నాకు అర్థం కావడం లేదని అంబేద్కర్ గారికి ఉత్తరం రాసింది రమాబాయి.
నా దేశంలో లక్షల మంది చిన్నారులు తిండికి లేక ఆరోగ్యం సరిగా లేక ఏదో ఒక కారణంతో చనిపోతున్నారు వాళ్ళందరికీ న్యాయం జరగాలంటే నేను తప్పకుండా చదవాలి కాబట్టి మీ వద్ద ఉన్న 17 రూపాయలు నాకు పంపమని ఆర్డర్ వేశాడు అంబేద్కర్ గారు.
రమాబాయి గారికి కూడా అంబేద్కర్ గారు చెప్పింది నచ్చింది ఇప్పటికిప్పుడు మధ్యలో చదువు ఆపేస్తే ఇన్నాళ్లు పడ్డ శ్రమ అంతా వేస్ట్ అవుతుందని ఆమె దగ్గర ఉన్న డబ్బు పంపింది.
కొన్నాళ్ళకు బాబు చనిపోయాడు ఇదే విషయాన్ని అంబేద్కర్ గారికి రమాబాయి ఉత్తరం రాసింది.. ఆ సమయంలో అంబేద్కర్ గారు చెప్పిన మాటలు ఏమిటో తెలుసా...
నీవు నా భార్యవు కాదు నా తల్లివి నీవే లేకుంటే నేను ఇంత దూరం వచ్చే వాడిని కాదు.. నేను నీ దగ్గర ఉండి ఉంటే పాదాభివందనం చేసేవాడిని నన్ను మన్నించు రమాబాయి నా చదువు కోసం పిల్లవాడిని చంపుకున్నాను నేను ఎంతో మనోవేదనకు గురవుతున్నానని తిరిగి లెటర్ రాశాడు.
చూశారా.. ఈ రోజుల్లో అయితే దేశం కోసం కాదు కదా కనీసం వీధి ఉన్నవారి కోసం కూడా హెల్ప్ చేయరు.
Comments
Post a Comment