బీసీల సమస్యను ఇన్నాళ్లు జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోవడం దురదృష్టకరం జగన్మోహన్ రెడ్డి బీసీలకు అన్యాయం చేశారు... తెలంగాణ ప్రభుత్వం న్యాయం చేస్తుంది నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీ కులాలుగా గుర్తింపు పొందిన 26 కులాలను , రాష్ట్ర విభజన అనంతరం గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ జాబితా నుంచి తొలగించినప్పటికీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇన్నాళ్లు పట్టించుకోకపోవడం దురదృష్టకరమని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు విమర్శించారు. రాబోయే రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ మూలాలు ఉన్న శెట్టిబలిజ, తూర్పు కాపులు, కొప్పుల వెలమ, ఈడిగ కులాల తోపాటు , ఇతర కులాల వారిని గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ జాబితాలో నుంచి తొలగించింది. నా బీసీలు, నా ఎస్సీలు అని చెప్పుకోవడం మినహా జగన్మోహన్ రెడ్డి వారికి చేసిందేమీ లేదన్నారు. మంగళవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆస్తులను పప్పు బెల్లాళ్ల తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జగన్మోహన్ రెడ్డ
WE ARE HERE TO SPREAD FACT ACROSS THE TRUTH. WE ARE ALWAYS STRIVE TO FIND THE TRUTH BEHIND THE LIE. FACTS ABOUT THE TRUTH...