మరి కాసేపట్లో మేడిగడ్డకు బయల్దేరునున్న సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులతోపాటు ఎమ్మెల్యేలంతా మేడిగడ్డ బ్యారేజీని సందర్శించడానికి బయల్దేరనున్నారు. Factclub : ఫిబ్రవరి 13 అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారి స్పీచ్ స్క్రోలింగ్ పాయింట్స్తె తెలంగాణ సస్యశ్యామలం చేసేందుకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఆనాటి ప్రభుత్వం రూ.38,500 కోట్లతో 2008 లో టెండర్లు పిలిచారు.రీడిజైన్ పేరుతో బీఆరెస్ ప్రభుత్వం ప్రాజెక్టు డిజైన్ మార్చి అంచనాలు పెంచింది. రూ.1లక్ష 47 వేల కోట్లకు అంచనాలు పెంచారు ఇసుక కదిలితే బ్యారేజ్ కూలింది అని వాళ్లు చెబుతున్నారు.. వాళ్లు ఇసుకలో పేక మేడలు కట్టారా? ఇండియా పాకిస్తాన్ బార్డర్ లా ప్రాజెక్టు వద్ద పహారా పెట్టారు.. ఎవరినీ చూడకుండా అడ్డుకున్నారు. కొంత మంది అధికారులు ఫైళ్ళు మాయంచేసినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.. దీంతో మా ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేపట్టింది. విజిలెన్స్ విచారణ చేపట్టి పూర్తి నివేదిక ఇచ్చింది… అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతీ శాసనసభ సభ్యుడిపై ఉంది..
WE ARE HERE TO SPREAD FACT ACROSS THE TRUTH. WE ARE ALWAYS STRIVE TO FIND THE TRUTH BEHIND THE LIE. FACTS ABOUT THE TRUTH...