*ఆ 17 హార్డ్ డిస్క్‌లను మూసారంబాగ్ మూసిలో పడవేశాం* హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్‌లో ప్రణీతరావు వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించారు. 1200 మంది ఫోన్లను ప్రణీత్ రావు ట్యాప్ చేసినట్లు పేర్కొన్నారు. జడ్జిలు, రాజకీయ నేతలు, ప్రతిపక్ష నేతలు, వారి కుటుంబ సభ్యులు, మీడియా పెద్దలు, జర్నలిస్టులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వ్యాపారవేత్తలు, ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వారి ఫోన్లను ట్యాప్ చేసినట్టు వెల్లడించారు. 8 ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు సిబ్బందితో టచ్‌లో ఉన్నట్టు ప్రణీతరావు తెలిపారు. అధికారికంగా మూడు ఫోన్లు కేటాయించిగా.. అనధికారికంగా ఐదు ఫోన్లతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసినట్టు వెల్లడించారు. ప్రభాకర్ రావు సాయంతో ట్యాపింగ్ చేశాం.. ఆర్థిక ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వాళ్ళ డబ్బులు ఎప్పటికప్పుడు పట్టుకున్నామన్నారు. పట్టుకున్న డబ్బు మొత్తాన్ని కూడా ఎవరికీ అనుమానం రాకుండా హవాలా నగదు అంటూ రికార్డుల్లో చూపించామని ప్రణీత్ రావు తెలిపారు. ఫోన్ టాపింగ్‌ల కోసం కన్వర్జెన్సీ ఇన్నోవేషన్ ల్యాబ్ సహాయం తీసుకున్నామన్నారు. ఈ ల్యాబ్‌కు సంబంధించిన శ్రీనివాస్, అనంతలో సహాయంతో ట్యాపింగ్‌ని
WE ARE HERE TO SPREAD FACT ACROSS THE TRUTH. WE ARE ALWAYS STRIVE TO FIND THE TRUTH BEHIND THE LIE. FACTS ABOUT THE TRUTH...