Skip to main content

PRANEET RAO CONFESSION STATEMENT IN PHONE TAPPING CASE | INTERROGATION IN PROCESS | @FACTCLUB

*ఆ 17 హార్డ్ డిస్క్‌లను మూసారంబాగ్ మూసిలో పడవేశాం* 
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్‌లో ప్రణీతరావు వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించారు.

1200 మంది ఫోన్లను ప్రణీత్ రావు ట్యాప్ చేసినట్లు పేర్కొన్నారు. జడ్జిలు, రాజకీయ నేతలు, ప్రతిపక్ష నేతలు, వారి కుటుంబ సభ్యులు, మీడియా పెద్దలు, జర్నలిస్టులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వ్యాపారవేత్తలు, ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వారి ఫోన్లను ట్యాప్ చేసినట్టు వెల్లడించారు.

 8 ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు సిబ్బందితో టచ్‌లో ఉన్నట్టు ప్రణీతరావు తెలిపారు. అధికారికంగా మూడు ఫోన్లు కేటాయించిగా.. అనధికారికంగా ఐదు ఫోన్లతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసినట్టు వెల్లడించారు.

ప్రభాకర్ రావు సాయంతో ట్యాపింగ్ చేశాం..

ఆర్థిక ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వాళ్ళ డబ్బులు ఎప్పటికప్పుడు పట్టుకున్నామన్నారు.

 పట్టుకున్న డబ్బు మొత్తాన్ని కూడా ఎవరికీ అనుమానం రాకుండా హవాలా నగదు అంటూ రికార్డుల్లో చూపించామని ప్రణీత్ రావు తెలిపారు. ఫోన్ టాపింగ్‌ల కోసం కన్వర్జెన్సీ ఇన్నోవేషన్ ల్యాబ్ సహాయం తీసుకున్నామన్నారు. 

ఈ ల్యాబ్‌కు సంబంధించిన శ్రీనివాస్, అనంతలో సహాయంతో ట్యాపింగ్‌ని విస్తృతం చేశామన్నారు. ప్రభాకర్ రావు సహాయంతో 17 సిస్టంల ద్వారా ట్యాపింగ్‌కు పాల్పడినట్టు వెల్లడించారు. 

రెండు లాగర్ రూమ్ లో 56 మంది సిబ్బందిని ఏర్పాటు చేసి ట్యాపింగ్ చేశామన్నారు. ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు నుంచి ట్యాపింగ్‌ని ఆఫ్ చేశామని ప్రణీత్ రావు తెలిపారు.

సెల్‌‌ఫోన్లు, పెన్‌డ్రైవ్‌లను బేగంపేట నాలాలో పడేశాం..

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ట్యాపింగ్ మొత్తాన్ని ఆపివేయాలని ప్రభాకర్ రావు చెప్పారని ప్రణీత్ రావు వెల్లడించారు. 

ప్రభాకర్ రావు రాజీనామా చేసి వెళ్ళిపోతూ టైపింగ్ సంబంధించిన సమాచారం ధ్వంసం చేయాలని ఆదేశించారని తెలిపారు. 

ప్రభాకర్ రావు ఆదేశాలతో 50 కొత్త హార్డ్ డిస్క్‌లను తీసుకువచ్చామన్నారు. పాత వాటిలో కొత్త హార్డ్ డిస్క్‌లు ఫిక్స్ చేశామన్నారు. 

17 హార్డ్ డిస్క్‌లలో అత్యంత కీలకమైన సమాచారం ఉందన్నారు. 17 హార్డ్ డిస్క్ లను కట్టర్‌తో కట్ చేసి ధ్వంసం చేశామన్నారు. 

పెద్ద ఎత్తున ఉన్న సీడీఆర్‌తో ఐడీపీఆర్ డాటా మొత్తాన్ని కూడా కాల్చివేసినట్టు ప్రణీత్ రావు వెల్లడించారు. పెన్ డ్రైవ్‌లు, హార్డ్ డిస్క్, ల్యాప్‌టాప్స్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల్లో ఉన్న డాటా మొత్తాన్ని ఫార్మాట్ చేశామన్నారు. 

ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్‌లన్నింటినీ కూడా నాగోల్ మూసారంబాగ్ మూసిలో పడవేసినట్టు తెలిపారు. ఫార్మాట్ చేసిన సెల్ ఫోన్లు, పెన్ డ్రైవ్లు అన్నిటిని కూడా బేగంపేట నాలాలో పడేసినట్టు ప్రణీత్ రావు తెలిపారు.. కేపి

Comments

Popular posts from this blog

Fighter is ready to release in OTT | NETFLIX | #FACTCLUB

బాలీవుడ్ ఔత్సాహికులు గత నెలలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏరియల్ యాక్షన్ చిత్రం "ఫైటర్" సినిమా థియేటర్లలోకి దూసుకెళ్లి, దాని అధిక-ఆక్టేన్ థ్రిల్స్ మరియు అద్భుతమైన ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఆడ్రినలిన్-పంపింగ్ దృశ్యాన్ని అందించారు.   Source : instagram  హృతిక్ రోషన్ మరియు దీపికా పదుకొణె ప్రధాన పాత్రలలో డైనమిక్ ద్వయం నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ప్రభావాన్ని చూపింది, ఆకట్టుకునే వసూళ్లను రూ.  340 కోట్లు. "ఫైటర్" చుట్టూ ఉన్న సందడి పరిశ్రమ అంతటా ప్రతిధ్వనిస్తూనే ఉంది, ఇప్పుడు అందరి దృష్టి దాని రాబోయే డిజిటల్ ప్రీమియర్‌పై ఆసక్తిగా ఉంది.   పరిశ్రమలోని అంతర్గత వ్యక్తుల ప్రకారం, ఈ చిత్రం స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో మార్చి 21, 2024న తన ప్రత్యేక అరంగేట్రం చేయనుంది, వీక్షకులకు వారి ఇళ్ల సౌకర్యం నుండి ఆనందకరమైన సినిమాటిక్ అనుభూతిని అందిస్తుంది.  అధికారిక ధృవీకరణ ఇంకా చేయవలసి ఉన్నప్పటికీ, యాక్షన్-ప్యాక్డ్ కోలాహలం చూసే అవకాశం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులలో ఇప్పటికే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. వయాకామ్ 18 స్టూడియోస్ మరియు మార్ఫ...

Karnataka CM Siddaramaiah visits The Rameshwaram Cafe, a day after a low-intensity explosion took place here in Bengaluru.

హోంశాఖ ఉన్నతాధికారులతో కర్ణాటక సీఎం సమావేశమయ్యారు KARNATAKA RAMESHWAR CAFE BLAST| BENGULURU |  బెంగళూరులోని సీఎం ప్రభుత్వ నివాసం కావేరిలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య హోంశాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. (ANI)  16:51 (IST), మార్చి 2  రామేశ్వరం కేఫ్‌ పేలుడు ఘటనపై సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ విచారణ: బెంగళూరు పోలీసు కమిషనర్‌  10 మంది గాయపడిన రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు దర్యాప్తును సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించామని, ఈ సంఘటనకు సంబంధించి ఎవరినీ అరెస్టు చేయలేదని బెంగళూరు పోలీస్ కమిషనర్ బి దయానంద శనివారం తెలిపారు.  'X'పై ఒక పోస్ట్‌లో, "కేసు దర్యాప్తును సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సిసిబి)కి అప్పగించారు. గాయపడిన వారందరూ కోలుకుంటున్నారు. ఎటువంటి అరెస్టు (ఎటువంటిది) చేయలేదు." బెంగళూరు తినుబండారం వద్ద నిన్న జరిగిన తక్కువ-తీవ్రత బాంబు పేలుడుకు సంబంధించి నలుగురిని విచారణ కోసం అదుపులోకి తీసుకున్నట్లు అంతకుముందు రోజు పోలీసు వర్గాలు తెలిపాయి. వాటిని ధార్వాడ్, హుబ్బళ్లి, బెంగళూరు నుంచి తీసుకెళ్లారు. ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ) వల్ల జరిగిన ఈ ...

BRAHMANI NARA NEW STORE OPENING | AUTONAGAR WEAVERSHALA | TDP, HERITAGE , AUTONAGAR

మంగళగిరి టౌన్  మంగళగిరి వీవర్‌శాల ప్రారంభోత్సవం  టాటా తనేరా సీఈవో అంబుజ నారాయణతో కలిసి ప్రారంభించిన హెరిటేజ్‌ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రహ్మణి  వీవర్‌శాలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నారా బ్రహ్మణి  వీవర్‌శాలలో ఏర్పాటు చేసిన ఆధునాతన చేనేత మగ్గాలను పరిశీలించిన నారా బ్రహ్మని  I love sarees. How about you? What's your favorite weave? #Mangalagiri #Saree #AndhraPradesh Nara Brahmani: ఆటోనగర్ లో వీవర్ శాల ప్రారంభోత్సవానికి హాజరైన నారా బ్రాహ్మణి మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులో బ్రాహ్మణి పర్యటన చేనేత డైయింగ్ షెడ్ ను పరిశీలించిన లోకేశ్ అర్ధాంగి తమ సమస్యలు విన్నవించుకున్న చేనేత కార్మికులు మంగళగిరి చేనేత రంగానికి టాటా గ్రూప్ మద్దతు Nara Brahmani attends Weavershala inauguration in Autonagar టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అర్ధాంగి నారా బ్రాహ్మణి నేడు మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులో పర్యటించారు. ఆత్మకూరులో ఉన్న చేనేత డైయింగ్ షెడ్ ను పరిశీలించారు. అక్కడి చేనేత కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.  తన పర్యటన సందర్భంగా నారా బ్రాహ్మణి ఆట...