Skip to main content

BREAKING : punjab police fires on haryana farmers | farmers protest against modiji government |


పంజాబ్ రైతులపై హర్యానా పోలీసుల ఫాసిస్ట్ హంతక దాడిని ఖండించండి...

హర్యానా ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేయాలి.

కాల్పుల్లో పాల్గొన్న పోలీసులను విధుల నుండి తొలగించాలి.

     నిన్న సాయంత్రం సుమారు 7 గంటల ప్రాంతంలో హర్యానా, పంజాబ్ సరిహద్దుల్లో హర్యానాకు చెందిన పోలీసులు ఫాసిస్టు హంతక స్వభావంతో అత్యంత కర్కశంగా జరిపిన కాల్పుల్లో పంజాబ్ రాష్ట్రానికి చెందిన బటిండా జిల్లాలోని బాలన్ గ్రామానికి చెందిన 24 సంవత్సరాల యువకుడు శుభకరన్ సింగ్ మరణించాడు.


 ఈ నరహంతకు దాడిని CPI (M-L) న్యూడెమోక్రసీ నల్లగొండ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది. బరితెగించి కాల్పులకు తెగబడిన సంబంధిత హర్యానా పోలీసులను వెంటనే హత్యా నేరం కింద అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తుంది. ఈ కాల్పుల సంఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత సమగ్ర విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేస్తుంది.

    స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం రైతులు పండించిన (పంటకు ఎం.ఎస్.పి ) పంటలన్నింటికీ కనీస మద్దతు ధర ఉత్పత్తి వ్యయంపై ఒకటిన్నర రేట్లు చెల్లించాలని, రుణ విమోచన చట్టం తీసుకురావాలని, 

విద్యుత్ సవరణ బిల్లు ద్వారా విద్యుత్తు రంగ ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలని, కౌలు రైతులకు తగిన రక్షణ కల్పించాలని, మూడు వ్యవసాయ సాగు చట్టాలను బేసిక్ గా ఉపసంహరించుకోవాలని,


 ఢిల్లీ కేంద్రంగా సాగిన చారిత్రాత్మకమైన రైతంగ పోరాటంలో మరణించిన 750 మంది రైతు కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించాలని, తదితర డిమాండ్ల పరిష్కారం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై అమానుషంగా కాల్పులు చేయడం కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వ ,కార్పొరేట్, మతతత్వ విధానాలకు నిదర్శనమని CPI (M-L) న్యూడెమోక్రసీ, అభిప్రాయపడుతుంది.

   ఢిల్లీ కేంద్రంగా సాగిన రైతాంగ పోరాటంతో  సాగు చట్టాల ఉపసంహరణకు, రైతుల పంటలకు ఎం ఎస్ పి ఇస్తామన్న నరేంద్ర మోడీ రాతపూర్వక హామీని అమలు చెయ్యని కారణంగా, తిరిగి ఉద్యమ బాట పట్టిన రైతుల న్యాయమైన ఈ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాల్సిన బాధ్యతను విస్మరించి, 

నిర్బంధం, అణిచివేత ద్వారా ఉద్యమాన్ని ఆపాలనుకోవడం ఫాసిస్ట్ ఆలోచన తప్ప వేరు కాదని CPI (M-L) న్యూడెమోక్రసీ పేర్కొన్నది. 


   శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై హర్యానా పోలీసులు జరిపిన కాల్పుల ను ఖండించవలసిందిగా ప్రజలను, ప్రజాస్వామిక వాదులను మేధావులను కోరుతున్నది.

Comments

Popular posts from this blog

100 NEW BUSES LAUNCH BY TELANGANA CM GARU REVANTHREDDY SIR

 100 NEW BUSES LAUNCH BY TELANGANA CM GARU REVANTHREDDY SIR  హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో 100 కొత్త బస్సులను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు. బస్సులను ప్రారంభించిన అనంతరం బస్సులో ప్రయాణించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు. ఆర్టీసీని ఆర్ధికంగా బలోపేతం చేసే ఉద్దేశంతోనే మహాలక్ష్మీ పథకాన్ని తీసుకొచ్చినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.  మహాలక్ష్మీ పథకంలో రోజుకు ప్రభుత్వంపై రూ.13 కోట్లు, ప్రతి నెల రూ.300 కోట్ల భారం పడినా.. వెనకడుగు వేయకుండా ముందుకుసాగుతున్నామని వివరించారు.  ట్యాంక్‌బండ్‌పై 100 నూతన బస్సులను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.  సమ్మక్క- సారలమ్మ జాతరకు వెళ్లే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో్ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. 

CM REVANTH REDDY SIR DEMANDS TO EX CM TO COME AND PARTICIPATE IN ASSEMBLY SESSIONS ON BUDJECT SESSION.

*దమ్ముంటే అసెంబ్లీకి రా.. కేసిఆర్* *జనం పై శ్రద్ధ లేని ఈ అహంకారిని తెలంగాణ ప్రాంతంలోనే బొంద పెట్టాలి..* *_తెలంగాణ ద్రోహి కల్వకుంట్ల చంద్రశేఖర రావు_* మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అసెంబ్లీ సమావేశాలకు ఎందుకు డుమ్మా కొడుతున్నట్టు.❓ కాలేశ్వరం అవినీతి మీద ప్రజల దృష్టి మళ్లించడానికి చలో నల్గొండ అంటూ బీఆర్ఎస్ పార్టీ KCR డ్రామాలు. తెలంగాణ రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవించని KCR రాజకీయ సన్యాసం తీసుకుంటే తెలంగాణ తల్లి సంతోషిస్తుంది.. ప్రజా క్షేత్రంలో ప్రజల తీర్పును గౌరవించని ఏ నాయకుడైనా దేశ ద్రోహితో సమానం..

BRS MLA'S WALKOUT FROM ASSEMBLY | DUE TO CM REVANTHREDDY SIR IMPROPER L...

ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడడానికి వెళ్తున్న బి.ఆర్.సి ఎమ్మెల్యేలను అడ్డుకున్న మార్చల్స్అ. సెంబ్లీ నడుస్తుండగా మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు మాట్లాడకూడదని ఎప్పుడు నిబంధన పెట్టగానే నిబంధన ఎప్పుడు పెట్టారని చీఫ్ మార్షల్ ను ప్రశ్నించిన ఎమ్మెల్యేలు నిబంధన ఉంటే తమకు చూపించాలన్న ఎమ్మెల్యేలు  అసెంబ్లీ లోపల మాట్లాడడానికి అవకాశం ఇవ్వరు అసెంబ్లీ బయట కూడా మీడియాతో మాట్లాడేందుకు అనుమతి కూడా ఇవ్వరా నిబంధన లేకుంటే ఎలా ఆపుతారని.  ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కంచెల రాజ్యం పోలీస్ రాజ్యమని నినాదాలు చేస్తూ నిరసన దిగిన ఎమ్మెల్యేలు హరీష్ రావు పళ్ళ రాజేశ్వర్రెడ్డి వేముల వీరేష్ కడియం శ్రీహరి...