Skip to main content

Posts

Showing posts from June, 2024

Pranamillina in the paved area Chandrababu AP CM Chandrababu in Amaravati Traveling Neglected under the YCP regime Many constructions and conditions of the capital region

శంకుస్థాపన చేసిన ప్రాంతంలో ప్రణమిల్లిన చంద్రబాబు ఏపీ సీఎం చంద్రబాబు అమరావతిలో పర్యటిస్తున్నారు. YCP పాలనలో నిర్లక్ష్యానికి గురైన పలు నిర్మాణాలు, రాజధాని ప్రాంత స్థితిగతుల్ని ఆయన పరిశీలిస్తున్నారు. ఈక్రమంలో ఆయన ఉద్దండరాయునిపాలెం బయల్దేరి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ మోకాళ్లపై కూర్చొని నమస్కరించారు.

వారణాసి పర్యటనలో మోదీ కారుపైకి చెప్పు విసిరారా? లేక గుర్తు తెలియని వస్తువా?

video footage వారణాసి పర్యటనలో మోదీ కారుపైకి చెప్పు విసిరారా? లేక గుర్తు తెలియని వస్తువా? ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి మంగళవారం వారణాసికి వచ్చిన నరేంద్రమోదీ వాహనంపై గుర్తు తెలియని వస్తువు పడటం వివాదాస్పదంగా మారింది. అది ఎవరైనా విసిరిన చెప్పు లేదా గుర్తు తెలియని వస్తువుగా భావిస్తున్నారు ఉద్దేశపూర్వకంగా విసిరింది కాదంటున్న యూపీ పోలీస్‌ వారణాసి: ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి మంగళవారం వారణాసికి వచ్చిన నరేంద్రమోదీ వాహనంపై గుర్తు తెలియని వస్తువు పడటం వివాదాస్పదంగా మారింది.   అది ఎవరైనా విసిరిన చెప్పు లేదా గుర్తు తెలియని వస్తువుగా భావిస్తున్నారు. కొందరు మొబైల్‌ అని చెబుతున్నారు. యూపీ పోలీసులు మాత్రం అది ఉద్దేశపూర్వకంగా విసిరింది కాదని వివరణ ఇస్తున్నారు.  వారణాసి ఎంపీగా గెలిచిన మోదీకి గత రెండు పర్యాయాలతో పోల్చితే భారీగా మెజార్టీ తగ్గిపోయిన విషయం తెలిసిందే. మోదీ వాహనం వెళుతుండగా..  రోడ్డుకు ఇరువైపులా ప్రజలు నిలబడి ఉన్న సమయంలో అకస్మాత్తుగా ఏదో గుర్తు తెలియని వస్తువు మోదీ ప్రయాణిస్తున్న కారుపై పడటం..  వెంటనే కారు బానెట్‌పై ఉన్న ఆయన అంగరక్షకుడు దాని

PRANEET RAO CONFESSION STATEMENT IN PHONE TAPPING CASE | INTERROGATION IN PROCESS | @FACTCLUB

*ఆ 17 హార్డ్ డిస్క్‌లను మూసారంబాగ్ మూసిలో పడవేశాం*  హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్‌లో ప్రణీతరావు వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించారు. 1200 మంది ఫోన్లను ప్రణీత్ రావు ట్యాప్ చేసినట్లు పేర్కొన్నారు. జడ్జిలు, రాజకీయ నేతలు, ప్రతిపక్ష నేతలు, వారి కుటుంబ సభ్యులు, మీడియా పెద్దలు, జర్నలిస్టులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వ్యాపారవేత్తలు, ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వారి ఫోన్లను ట్యాప్ చేసినట్టు వెల్లడించారు.  8 ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు సిబ్బందితో టచ్‌లో ఉన్నట్టు ప్రణీతరావు తెలిపారు. అధికారికంగా మూడు ఫోన్లు కేటాయించిగా.. అనధికారికంగా ఐదు ఫోన్లతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసినట్టు వెల్లడించారు. ప్రభాకర్ రావు సాయంతో ట్యాపింగ్ చేశాం.. ఆర్థిక ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వాళ్ళ డబ్బులు ఎప్పటికప్పుడు పట్టుకున్నామన్నారు.  పట్టుకున్న డబ్బు మొత్తాన్ని కూడా ఎవరికీ అనుమానం రాకుండా హవాలా నగదు అంటూ రికార్డుల్లో చూపించామని ప్రణీత్ రావు తెలిపారు. ఫోన్ టాపింగ్‌ల కోసం కన్వర్జెన్సీ ఇన్నోవేషన్ ల్యాబ్ సహాయం తీసుకున్నామన్నారు.  ఈ ల్యాబ్‌కు సంబంధించిన శ్రీనివాస్, అనంతలో సహాయంతో ట్యాపింగ్‌ని