Skip to main content

వారణాసి పర్యటనలో మోదీ కారుపైకి చెప్పు విసిరారా? లేక గుర్తు తెలియని వస్తువా?

video footage

వారణాసి పర్యటనలో మోదీ కారుపైకి చెప్పు విసిరారా? లేక గుర్తు తెలియని వస్తువా?

ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి మంగళవారం వారణాసికి వచ్చిన నరేంద్రమోదీ వాహనంపై గుర్తు తెలియని వస్తువు పడటం వివాదాస్పదంగా మారింది. అది ఎవరైనా విసిరిన చెప్పు లేదా గుర్తు తెలియని వస్తువుగా భావిస్తున్నారు


ఉద్దేశపూర్వకంగా విసిరింది కాదంటున్న యూపీ పోలీస్‌
వారణాసి: ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి మంగళవారం వారణాసికి వచ్చిన నరేంద్రమోదీ వాహనంపై గుర్తు తెలియని వస్తువు పడటం వివాదాస్పదంగా మారింది.

 
అది ఎవరైనా విసిరిన చెప్పు లేదా గుర్తు తెలియని వస్తువుగా భావిస్తున్నారు. కొందరు మొబైల్‌ అని చెబుతున్నారు. యూపీ పోలీసులు మాత్రం అది ఉద్దేశపూర్వకంగా విసిరింది కాదని వివరణ ఇస్తున్నారు. 

వారణాసి ఎంపీగా గెలిచిన మోదీకి గత రెండు పర్యాయాలతో పోల్చితే భారీగా మెజార్టీ తగ్గిపోయిన విషయం తెలిసిందే. మోదీ వాహనం వెళుతుండగా.. 

రోడ్డుకు ఇరువైపులా ప్రజలు నిలబడి ఉన్న సమయంలో అకస్మాత్తుగా ఏదో గుర్తు తెలియని వస్తువు మోదీ ప్రయాణిస్తున్న కారుపై పడటం..

 వెంటనే కారు బానెట్‌పై ఉన్న ఆయన అంగరక్షకుడు దానిని తీసి అవతలపడేయటం ఒక వీడియోలో కనిపిస్తున్నది. ఇప్పుడు ఆ వస్తువు ఏంటనే అంశంలో చర్చ నడుస్తున్నది. భారీ భద్రత మధ్య ఉండే ప్రధాని కాన్వాయ్‌పైకి వస్తువును ఎలా విసిరారు? ఎవరు విసిరారు? అనే అంశం తేలాల్సి ఉన్నది. 

అయితే ఆ వీడియో సరైందేనా? అన్నది కూడా తెలియాల్సి ఉన్నది. మోదీ కాన్వాయ్‌ దశాశ్వమేధ ఘాట్‌ నుంచి కేవీ మందిర్‌కు వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తున్నది. 1.41 నిమిషాల నిడివి కలిగిన ఈ వీడియోలో 19 సెకన్ల భాగంలో పక్కనే నిలబడి ఉన్న ఒక వ్యక్తి.. చెప్పు విసిరారు..

 అంటూ అరవడం వినిపిస్తున్నది. ఆ వెంటనే ఐదు లేదా ఆరు సెకన్ల వ్యవధిలో పీఎం భద్రతా సిబ్బంది తన చేత్తో దానిని పట్టుకుని పక్కకు విసిరేయడం కనిపిస్తున్నది.


అయితే.. అది చెప్పు కాదని, మొబైల్‌ ఫోన్‌ అని పేరు రాయడానికి నిరాకరించిన యూపీ పోలీస్‌ అధికారి ఒకరు చెప్పారు.

 ఈ ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని అన్నారు. ఉద్దేశపూర్వకంగా కాకపోతే మొబైల్‌ ఫోన్‌ ఎందుకు విసిరి ఉంటారన్న ప్రశ్నకు ఆయన జవాబు చెప్పలేదు.

 ఇది మోదీ కన్వాయ్‌లో భద్రతా లోపమా? అన్న విషయానికి కూడా ఆయన వివరణ ఇవ్వలేదు. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద 20వేల కోట్ల రూపాయలను 17వ విడుత కింద విడుదల చేసే కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. 

ఈ నిధులు 9.26 కోట్ల మంది రైతులకు ఉద్దేశించారు. మోదీకి వారణాసిలో 2019 ఎన్నికల్లో 4.8 లక్షల మెజార్టీ రాగా.. 2024 ఎన్నికల్లో 1,52,513 మెజార్టీ మాత్రమే లభించింది. 

మోదీ వాహనంపైకి ఒక వస్తువు పడటం అనేది ఇదే మొదటిసారి. గతంలో మోదీ పాల్గొన్న కొన్ని కార్యక్రమాల్లో ఆయన వ్యతిరేకులు నల్ల దుస్తులు ధరించి నిరసనలకు ప్రయత్నించినా.. భద్రతా సిబ్బంది వారిని అనుమతించలేదు.

Comments

Popular posts from this blog

BRAHMANI NARA NEW STORE OPENING | AUTONAGAR WEAVERSHALA | TDP, HERITAGE , AUTONAGAR

మంగళగిరి టౌన్  మంగళగిరి వీవర్‌శాల ప్రారంభోత్సవం  టాటా తనేరా సీఈవో అంబుజ నారాయణతో కలిసి ప్రారంభించిన హెరిటేజ్‌ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రహ్మణి  వీవర్‌శాలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నారా బ్రహ్మణి  వీవర్‌శాలలో ఏర్పాటు చేసిన ఆధునాతన చేనేత మగ్గాలను పరిశీలించిన నారా బ్రహ్మని  I love sarees. How about you? What's your favorite weave? #Mangalagiri #Saree #AndhraPradesh Nara Brahmani: ఆటోనగర్ లో వీవర్ శాల ప్రారంభోత్సవానికి హాజరైన నారా బ్రాహ్మణి మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులో బ్రాహ్మణి పర్యటన చేనేత డైయింగ్ షెడ్ ను పరిశీలించిన లోకేశ్ అర్ధాంగి తమ సమస్యలు విన్నవించుకున్న చేనేత కార్మికులు మంగళగిరి చేనేత రంగానికి టాటా గ్రూప్ మద్దతు Nara Brahmani attends Weavershala inauguration in Autonagar టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అర్ధాంగి నారా బ్రాహ్మణి నేడు మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులో పర్యటించారు. ఆత్మకూరులో ఉన్న చేనేత డైయింగ్ షెడ్ ను పరిశీలించారు. అక్కడి చేనేత కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.  తన పర్యటన సందర్భంగా నారా బ్రాహ్మణి ఆట...

Karnataka CM Siddaramaiah visits The Rameshwaram Cafe, a day after a low-intensity explosion took place here in Bengaluru.

హోంశాఖ ఉన్నతాధికారులతో కర్ణాటక సీఎం సమావేశమయ్యారు KARNATAKA RAMESHWAR CAFE BLAST| BENGULURU |  బెంగళూరులోని సీఎం ప్రభుత్వ నివాసం కావేరిలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య హోంశాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. (ANI)  16:51 (IST), మార్చి 2  రామేశ్వరం కేఫ్‌ పేలుడు ఘటనపై సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ విచారణ: బెంగళూరు పోలీసు కమిషనర్‌  10 మంది గాయపడిన రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు దర్యాప్తును సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించామని, ఈ సంఘటనకు సంబంధించి ఎవరినీ అరెస్టు చేయలేదని బెంగళూరు పోలీస్ కమిషనర్ బి దయానంద శనివారం తెలిపారు.  'X'పై ఒక పోస్ట్‌లో, "కేసు దర్యాప్తును సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సిసిబి)కి అప్పగించారు. గాయపడిన వారందరూ కోలుకుంటున్నారు. ఎటువంటి అరెస్టు (ఎటువంటిది) చేయలేదు." బెంగళూరు తినుబండారం వద్ద నిన్న జరిగిన తక్కువ-తీవ్రత బాంబు పేలుడుకు సంబంధించి నలుగురిని విచారణ కోసం అదుపులోకి తీసుకున్నట్లు అంతకుముందు రోజు పోలీసు వర్గాలు తెలిపాయి. వాటిని ధార్వాడ్, హుబ్బళ్లి, బెంగళూరు నుంచి తీసుకెళ్లారు. ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ) వల్ల జరిగిన ఈ ...

| SRILEELA SUDDENLY TAKEOFF | still waiting for a good hit almost average films till done with no mark | Factclub.

శ్రీలీల తక్కువ కాలంలోనే అగ్ర కథానాయికగా ఎదిగింది. వరుస ఫ్లాపులు, డిజాస్టర్లతో డిమాండ్ తగ్గిపోతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఓ సినిమా ఉండగా, మరో సినిమా ప్లాన్ దశలో ఉంది.  ప్లాన్ చేసిన విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి సినిమా విషయంలో క్లారిటీ లేదు కానీ నితిన్ సరసన నటిస్తున్న రెండో సినిమా "రాబిన్ హుడ్" ఇంకా శ్రీలీల చేతిలోనే ఉంది.   వారం రోజుల పాటు ఆమెతో షూట్ కూడా చేశారు. ఈ క్రమంలోనే శ్రీలీల ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ నివేదికలు నిజం కాదు.  నితిన్ సినిమాని పక్కన పెడితే కృతి శెట్టి లాగానే శ్రీలీల కూడా అదే స్పీడ్‌తో స్టార్‌డమ్‌పై దూకి నేలకూలింది. ఇప్పుడు ప్లానింగ్‌లో కొత్త సినిమాలు లేవు.  అంతేకాదు ప్రతి సినిమాలో ఆమె డ్యాన్స్ చేసి ప్రేక్షకులకు బోర్ కొట్టించింది. "గుంటూరు కారం" సినిమాలో అయితే శ్రీలీల నిష్టూరంగా కనిపించింది.  నిర్మాతలు మరియు దర్శకులు కూడా శ్రీలీలాను కేవలం ఆమె డ్యాన్స్ స్కిల్స్ కోసమే తీసుకున్నట్లు వాడుకున్నారు. అయితే అక్కడ కూడా ఆమెకు సాయి పల్లవిలాగా యూఎస్పీలో ఎలాంటి ప్రత్యేక గుర్తింపు రాలేదు.  ఇప్పుడు ...